Saturday, 31 May 2014

ఆత్మీయులు పద్మభూషణ్ సూపెర్ స్టార్ గంటమనేని కృష్ణ గారికి నా జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాను.

 

 

 

తెలుగువీర లేవరా... దీక్షబూని సాగరా.... అల్లూరి సీతారామరాజు (1974)














పల్లవి :
ఓహో... హో... ఓహోహో... ఓ... ఓ....
తెలుగువీర లేవరా... ఆ... దీక్షబూని సాగరా.... ఆ...
తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా
దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా
తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా
దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా

చరణం : 1
దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా... ఆ...
నీతిలేని శాసనాలు నేటి నుండి రద్దురా... ఆ...
దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా... ఆ...
నీతిలేని శాసనాలు నేటి నుండి రద్దురా... ఆ...
నిదురవద్దు... బెదరవద్దు...నిదురవద్దు... బెదరవద్దు...
నింగి నీకు హద్దురా... నింగి నీకు హద్దురా...

చరణం : 2
ఓ... ఎవడువాడు ఎచటివాడు.... ఎవడువాడు ఎచటివాడు
ఇటు వచ్చిన తెల్లవాడు... ఇటు వచ్చిన తెల్లవాడు
కండబలం కొండఫలం
కబళించే దుండగీడు... కబళించే దుండగీడు
మానధనం ప్రాణధనం
దోచుకునే దొంగవాడు... దోచుకునే దొంగవాడు
ఎవడువాడు ఎచటివాడు...ఇటు వచ్చిన తెల్లవాడు
తగిన శాస్తి చెయ్యరా... తగిన శాస్తి చెయ్యరా
తరిమి తరిమి కొట్టరా... తరిమి తరిమి కొట్టరా
తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా
దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా

చరణం : 3
ఈ దేశం ఈ రాజ్యం... ఈ దేశం ఈ రాజ్యం
నాదే అని చాటించి... నాదే అని చాటించి
ప్రతిమనిషి తొడలుగొట్టి
శృంఖలాలు పగులగొట్టి... శృంఖలాలు పగులగొట్టి
చురకత్తులు పదునుబట్టి
తుది సమరం మొదలుబెట్టి... తుది సమరం మొదలుబెట్టి
సింహాలై గర్జించాలి... సింహాలై గర్జించాలి
సంహారం సాగించాలి... సంహారం సాగించాలి
వందేమాతరం... వందేమాతరం...
వందేమాతరం... వందేమాతరం...

ఓ... ఓ... స్వాతంత్య్రవీరుడా! స్వరాజ్యభానుడా!
అల్లూరి సీతారామరాజా! అల్లూరి సీతారామరాజా!
స్వాతంత్య్రవీరుడా! స్వరాజ్యభానుడా!
అల్లూరి సీతారామరాజా! అల్లూరి సీతారామరాజా!
అందుకో మా పూజలందుకో రాజా
అందుకో మా పూజలందుకో రాజా
అల్లూరి సీతారామరాజా! అల్లూరి సీతారామరాజా!

ఓ... తెల్లవారి గుండెల్లో నిదురించినవాడా!
మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించినవాడా!
తెల్లవారి గుండెల్లో నిదురించినవాడా!
మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించినవాడా!
త్యాగాలే వరిస్తాం కష్టాలే భరిస్తాం
త్యాగాలే వరిస్తాం కష్టాలే భరిస్తాం
నిశ్చయముగ... నిర్భయముగ... నీ వెంటనె నడుస్తాం...
నిశ్చయముగ... నిర్భయముగ... నీ వెంటనె నడుస్తాం...
నీ వెంటనె నడుస్తాం...


చిత్రం : అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం : పి.ఆదినారాయణరావు
రచన : శ్రీశ్రీ
గానం : ఘంటసాల, రామకృష్ణ, బృందం
*************************************


తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్ 

No comments: