Friday, 16 May 2014

సౌందర్య సీమ నీరజశ్యామ నిజభుజోక్తామ----తక్షణ రక్షణ విశ్వవిలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా----భూతల పతంగా... మధు మంగళ రూపమే చూపవేమిరా

 నా ద్వారా పూర్తిగా వ్యక్తము అయిన పాట గ్రహించగలరు




దాశరధీ...  కరుణా పయోనిధి
నువ్వే  దిక్కని  నమ్మడమా
నీ ఆలయమును  నిర్మించడమా
నిరతము  నిను   భజయించడమా
రామ  కోటి  రచియించడమా
సీతా రామస్వామి  నే  చేసిన  నేరమదేమి
నీ  దయ  చూపవదేమి  నీ దర్శన  మీయవిదేమి
దాశరధీ  కరుణా పయోనిధి

గుహుడు  నీకు  చుట్టమా గుండెలకు  హత్తుకున్నావు
శబరి  నీకు  తోబుట్టువా ఎంగిలి  పళ్ళను  తిన్నావు
నీ   రాజ్యము  రాసిమ్మంటినా  నీ  దర్శనమే  ఇమ్మంటిని  కాని
ఏల రావు..  నన్నేలరావు...  నన్నేల  ఏల  ఏల రావు
సీతా రామస్వామి... సీతా రామస్వామి  నే  చేసిన  నేరమదేమి
నీ  దయ  చూపవదేమి  నీ దర్శన  మీయవిదేమి
దాశరధీ  కరుణా పయోనిధి

రామ రసరమ్య  రామ రమణీయ
రామ  రఘువంశ  సోమ  రణరంగ  భీమ
రాక్షస  విరామ కమనీయ ధామ
సౌందర్య  సీమ  నీరజశ్యామ  నిజభుజోక్తామ
భోజనల  లామ  భువనజయ రామ  పాహి  భద్రాద్రి  రామ  పాహీ..

తక్షణ  రక్షణ  విశ్వవిలక్షణ  ధర్మ  విచక్షణ గోదారి కలిసెనేమిరా
డాం డ డ  డాండ డాండ  నినదమ్ముల
జాండమునిండ మత్తవేదండము  నెక్కినే   పొగడు  నీ  అభయవ్రతమేదిరా
ప్రేమ  రసాంతరంగ  హృదయంగమ
సుంగ శుభంగ  రంగ  బహురంగద
భంగ  తుంగ  సుగుణైక తరంగ
సుసంగ సత్య  సారంగ  సుశ్రుతివిహంగ  పాప  మృదు సంగ  విభంగ
భూతల  పతంగా...  మధు  మంగళ  రూపమే  చూపవేమిరా
గరుడగమన  రారా ... గరుడగమన  రారా ...


ఈ విదముగా నా ద్వారా పూర్తి గా వ్యక్తము అయినది

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

No comments: