Saturday, 24 May 2014

ఇతరుల చిరు నవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా మరి నా కను పాపల్లో నలుపై ణిలిచావేమ్మా తెలవారి తొలి కాంతి నీవో బలి కోరు పంతానివో అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ ఓ ఓ హృదయం ఓర్చుకోలేనిదీ గాయం ఇక పై తలచుకోరానిదీ ఈ నిజం

హృదయం ఓర్చుకోలేనిదీ గాయం........ పరుగు(2008)

హృదయం ఓర్చుకోలేనిదీ గాయం
ఇక పై తలచుకోరానిదీ ఈ నిజం
పెదవులు విడిరాక నిలువవె కడదాక
జీవంలో ఒదగవె ఒంటరిగా
లో లో ముగిసే మౌనంగా ఓ ఓ ఓఊఊ
హృదయం ఓర్చుకోలేనిదీ గాయం
ఇక పై తలచుకోరానిదీ ఈ నిజం

ఊహాల లోకంలో ఎగరకు అన్నవే
తేలని మైకంలో పడకని ఆపావే
ఇతరుల చిరు నవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా
మరి నా కను పాపల్లో నలుపై ణిలిచావేమ్మా
తెలవారి తొలి కాంతి నీవో బలి కోరు పంతానివో
అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ ఓ ఓ
హృదయం ఓర్చుకోలేనిదీ గాయం
ఇక పై తలచుకోరానిదీ ఈ నిజం

వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు
చల్లని చూపులతో దీవెనలిస్తాడూ
అంతటి దూరం ఉంటే బ్రతికించే వరమౌతాడూ
చెంతకి చేరాడంటే చితిమంటే అవుతాడూ
హలాహలం నాకు సొంతం నువు తీసుకో అమృతం
అనకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా ఓ ఓ ఓ
హృదయం ఓర్చుకోలేనిదీ గాయం
ఇక పై తలచుకోరానిదీ ఈ నిజం
చిత్రం: పరుగు(2008)
రచన: సిరివెన్నెల సీత రామ శాస్త్రి
సంగీతం: మణి శర్మ
గానం: హేమ చంద్ర
 
 
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

No comments: