పరుగులు తీయకె పసిదానా .... పరుగు(2008)
పరుగులు తీయకె పసిదానా
ఫలితము లేదని తెలిసున్నా 2
నేడైనా రేపైనా జరిగేదే ఎపుడైనా
నీ గుండెల్లో కూర్చున్నా గుట్టంతా గమనిస్తున్నా
వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా వదిలేస్తానా
పనిమాలా నాకెదురొచ్చి
పరువాల వుచ్చు బిగించి
పది చచ్చే పిచ్చిని పెంచి
కట్టావె నన్ను లాక్కొచ్చి
కుందేలై కుప్పించి అందాలే గుప్పించి
ఇందాక రప్పించీ పొమ్మనకే నన్ను విదిలించీ
వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా వదిలేస్తానా 2
పరుగులు తీయకె పసిదానా
ఫలితము లేదని తెలిసున్నా
ఉలికిపడే ఊహలే సాక్షి
ఊసురనే ఊపిరే సాక్షి
బెదురుతున్న చూపుల సాక్షి
అదురుతున్న పెదవుల సాక్షి
నమ్మాలే నలినాక్షి
నిజమేదో గుర్తించి
నీ పంతం చాలించి
నేనే నీ తిక్కని పెంచి
వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా వదిలేస్తానా ౩
చిత్రం: పరుగు(2008)
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: మణి శర్మ
గానం: రంజిత్
నమ్మవేమో గాని అందాల యువరాణి............ పరుగు (2008)
నేలపై వాలింది నా ముందే విరిసిందీ
నమ్మవేమో కాని అందాల యువరాణి
నేలపై వాలింది నా ముందే విరిసిందీ
అందుకే అమాంతం నా మదీ అక్కడే నిశ్శబ్దం అయినదీ
ఎందుకో ప్రపంచం అన్నదీ ఇక్కడే ఇలాగే నాతో ఉందీ
నిజంగా కల్లతో వింతగా మంత్రమేసిందీ
అదేదో మాయలో నన్నిలా ముంచి వేసిందీ
నిజంగా కల్లతో వింతగా మంత్రమేసిందీ
అదేదో మాయలో నన్నిలా ముంచి వేసిందీ
నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే
చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే
చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే
రూపం ఈడు బారాలై ముందర నిలుచుంటే
ఆ సొయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగ అయ్యాను నేనే
అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా
నిజంగా కల్లతో వింతగా మంత్రమేసిందీ
అదేదో మాయలో నన్నిలా ముంచి వేసిందీ
నిజంగా కల్లతో వింతగా మంత్రమేసిందీ
అదేదో మాయలో నన్నిలా ముంచి వేసిందీ
వేకువలోనా ఆకాశం ఆమెను చేరింది
ఓ క్షణమైనా అధరాల రంగును ఇమ్మందీ
వేసవి పాపం చలి వేసి ఆమెను వేడింది
శ్వసల లోన తల దాచి జలిగ కూర్చుంది
ఆ అందమంతా నా సొంతమైతే ఆనందమైనా వందేళ్ళు నావే
కలల తాకిడిని మనసు తాలదిక వెతికి చూడు చెలిని
నిజంగా కల్లతో వింతగా మంత్రమేసిందీ
అదేదో మాయలో నన్నిలా ముంచి వేసిందీ
సంగీతం : మణి శర్మ
రచన : అనంత శ్రీ రాం
గానం : సాకేత్
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment