ఆడించి అష్ట చెమ్మా ఓడించావమ్మా ...... అష్టా చెమ్మా (2008)

ఆడించి అష్ట చెమ్మా ఓడించావమ్మా
నీ పంట పండిందే ప్రేమా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటె అంటే ఈ చిన్నారీ నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఓ ఓ .......
ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా
ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా
చూశాక నిన్ను వేశాక కన్ను వెనెక్కేలాగ తీసుకొను
ఎం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వోద్దన్నా నేనొప్పుకోను
నువ్వేసే గవ్వలాటలొ నిలేసే గళ్ళ బాటలొ
నీ దాకా నన్ను రప్పించ్చింది నువ్వే లేవమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడటం అంతే
ఓ ఓ.......
నా నేరం ఏముందే ఎం చెప్పిందో నీ తల్లో జేజెమ్మా
మందారం అయ్యింది ఆ రోషం తాకి జళ్ళో జాజమ్మా
పూవ్వంటీ రూపం నాజూగ్గా గిల్లీ కెవ్వంది గుండె నిన్న దాకా
ముళ్ళంటీ కోపం వొళ్ళంతా అల్లీ నవ్వింది నేడు ఆగలేక
మన్నిస్తే తప్పేం లేదమ్మా మరీ ఈ మారం మానమ్మా
ఈ లావాదేవీ లేవీ అంత కొత్తేం కాదమ్మా
చిత్రం : అష్టా చెమ్మా (2008)
సంగీతం : కళ్యాణి మాలిక్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : శ్రీకృష్ణ
ఈ పాట నా ద్వారా మొదటి రెండు మూడు లైన్లు వ్యక్తము అయినది, ఆడించి అష్ట చెమ్మా ఓడించావమ్మా
నీ పంట పండిందే ప్రేమా, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే, ఆ మాటె అంటే ఈ చిన్నారీ నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే........
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment