ఏటయ్యిందే గోదారమ్మా ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు... శ్రీరామదాసు (2006)
పల్లవి:
హోసా .. హోలేసా .. హోలేసా... హోలే హోలేసా
ఏటయ్యిందే గోదారమ్మా
ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు
ఎదురుచూస్తున్నది గట్టు ఏమైనట్టు
నాకు కూడా ఎడమకన్ను అదురుతోంది నీమీదొట్టు
మన సీతారామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టూ
చరణం : 1
క్రిష్ణయ్యకు ఫించమైన నెమిలమ్మల దుంకులాట
ఎంకన్నకు పాలుదాపిన పాడావుల ఎగురులాట
రామునికి సాయం చేసిన ఉడత పిల్లల ఉరుకులాట
చెప్పకనె చెబుతున్నవీ...చెప్పకనే చెబుతున్నవీ
మన సీతరామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టూ
చరణం : 2
చెట్టుకి పందిరెయ్యాలని పిచ్చిపిచ్చి ఆశ నాది
ముల్లోకాలని కాసేటోణ్ణీ కాపాడాలనే పిచ్చినాది
నీడనిచ్చే దేవునికే నీడనిచ్చే ఎదురుచూపు
ఇన్నాళ్లకి నిజమయ్యే వివరం కనబడుతున్నది
రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు
మన రాముని సేవకెవరో మనసుపడే వస్తున్నట్టూ...
నా ద్వారా వ్యక్తము అయిన పాటలో ఇది ముఖ్యమైనది, ఒక మనిషి మాటలోకి వచ్చి మరల మనిషికి మాటకి మంచి రోజులు వచ్చినట్లు కాని అప్రమత్తం చెందటం లో నాణ్యత లేదు కావున వెంటనే నాణ్యం గా తీసుకోండి.
చిత్రం : శ్రీరామదాసు (2006)
సంగీతం : M.M.కీరవాణి
రచన : సుద్దాల అశోక్ తేజ
గానం : భువనచంద్ర, దేవిశ్రీ ప్రసాద్
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment