Monday, 2 June 2014

Old song i liked most of Balakrishna gaaru----Inspiring for good movie from hiim after he became MLA musical hit of great influence -----పూజలన్నీ పండి పురివిప్పి నేను జతులాడి అనురాగం శృతి చేయగా మోజులన్నీ పిండే మగతోడు చేరువీనడు సుఖభోగం మొదలౌనుగా ఊసులన్నీ మాలగా పూసగుచ్చివేయనా రాచకన్నెనేలగా దూసుకొచ్చి వాలనా కరిగా తొలకరిగా రసఝరిగా

ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన...... భైరవద్వీపం (1994) 

 

 











పల్లవి :
ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన
అందంగా అమరిందిలే
ఇక ఆనందం మిగిలిందిలే
నిజమెరుగవే పసిచిలుక
ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన
ఆనందం చిందించెలే...
నా అందం నీ వశమాయెలే
తెరమరుగిక తొలగునులే

చరణం : 1
కోరుకున్నవాడే తగువేళ చూసి
జతగూడే సుముహూర్తం ఎదురైనది
అందమైన ఈడే అందించమంటు
దరిచేరే సందేశం ఎద విన్నది
లేనిపోని లోని శంక మానుకోవె బాలిక
ఏలుకోవా గోరువంక లేత నీలి కానుక
కులుకా రసగుళిక కళలొలుక
తగు తరుణము దొరికెనుగా ॥

చరణం : 2
పూజలన్నీ పండి పురివిప్పి నేను జతులాడి
అనురాగం శృతి చేయగా
మోజులన్నీ పిండే మగతోడు చేరువీనాడు
సుఖభోగం మొదలౌనుగా
ఊసులన్నీ మాలగా పూసగుచ్చివేయనా
రాచకన్నెనేలగా దూసుకొచ్చి వాలనా
కరిగా తొలకరిగా రసఝరిగా
అణువణువొక చినుకవగా ॥


చిత్రం : భైరవద్వీపం (1994)
సంగీతం : మాధవపెద్ది సురేష్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
*************************************************

No comments: