ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)

ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల
వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ
మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయమనీ
నీ బరువూ...నీ పరువూ...మోసేదీ...
ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...
రాజనీ...పేదనీ, మంచనీ...చెడ్డనీ...భేదమే ఎరుగదీ యమపాశం
కోట్ల ఐశ్వర్యమూ...కటిక దారిద్ర్యమూ...హద్దులే చెరిపెనీ మరుభూమి
మూటలలోని మూలధనం...చేయదు నేడు సహగమనం
నీ వెంట...కడకంటా...నడిచేదీ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...
నలుగురూ మెచ్చినా...నలుగురూ తిట్టినా...విలువలే శిలువగా మోశావూ
అందరూ సుఖపడే...సంఘమే కోరుతూ...మందిలో మార్గమే వేశావూ
నలుగురు నేడు పదుగురిగా...పదుగురు వేలు వందలుగా
నీ వెనకే...అనుచరులై ...నడిచారూ...
ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...
పోయిరా నేస్తమా...పోయిరా ప్రియతమా...నీవు మా గుండెలో నిలిచావు
ఆత్మయే నిత్యమూ...జీవితం సత్యమూ...చేతలే నిలుచురా చిరకాలం
బతికిన నాడు బాసటగా...పోయిన నాడు ఊరటగా
అభిమానం...అనురాగం...చాటేదీ....
ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...
నా ద్వారా 2003 లో వ్యక్తమైన పాటలలో ఇది ఒకటి, ఈ విదముగా అన్ని రకముల పాటలు నా ద్వారా వ్యక్తము అయినవి అని పండితులు మేధావులు గుర్తించండి ఏక కాలంలో 64 కళలు పోషిచి లోకానికి వాక్కు నా ద్వారా భగవంతుడు ప్రసాదించినాడు అటువంటి నన్ను నా అవసరం వలే వదిలివేసినారు,. ఎవరూ సూటిగా పటించుకోవడం లేదు నన్ను ధర్మస్వరూపం గా ప్రజల లోనికి తీసుకొని వెళితే అనేక స్వార్ధ శక్తులు తగ్గి ధర్మమూర్తి అందరి మనసులో కొలువుతీరినాడు సత్యమును తెలుసుకొని ప్రజలు సంతోషిస్తారు.
చిత్రం : ఆ నలుగురు (2004)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
రచన : చైతన్య ప్రసాద్
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
No comments:
Post a Comment