Saturday, 14 June 2014

చాలాసార్లు మనిషి చేసే ఆలోచన కొట్టిపారేసేదిగానే వుంటుంది. కానీ మనిషిని ముందుకు నడిపించేది ఒక్క ఆలోచన మాత్రమే.


చాలాసార్లు మనిషి చేసే ఆలోచన కొట్టిపారేసేదిగానే వుంటుంది. కానీ మనిషిని ముందుకు నడిపించేది ఒక్క ఆలోచన మాత్రమే. 

ఎందుకంటే అప్పటి వరకు ప్రపంచంలో ఎవ్వరూ చూడని, ఊహించని దానివైపు నీ దృష్టిని సారించేతట్లు చేస్తుంది ఆలోచన. దానిని సాధించడంలో నిన్ను కర్తవ్యోన్ముఖుడిని చేసి అందుకవసరమైన ఉపకరణాలను సృష్టించే శక్తిని నీలో కలుగజేస్తుంది ఆలోచన. 

వందేళ్ళ క్రితం మనిషి ఊహల్లోనైనా లేని చంద్రునిపై కాలుమోపాలన్న ఆలోచన మనిషిని చంద్రమండలానికి తీసుకువెళ్ళింది. మానవజాతి చరిత్రలో ఆవిర్భవించిన ఎన్నో సామాజిక వ్యవస్థలు, మతరాజకీయ వ్యవస్థలు, సాంకేతిక ఆవిష్కరణలు, భాషాసాహిత్యాలు మొదలైనవన్నీ ఆలోచనల ఫలితాలే. 

మానవ జీవన గమనంలో ఎన్నో పరిణామాలకు, నాగరికతలకు ప్రాణం పోసింది మానవ మస్తిష్కంలో మెదలిన అద్భుత ఆలోచనలే. 

From:Kishore gaaru 





BY
His Highness, Majestic, Dharmaswaroop
Maharajashri shri Anjani Ravishankar Pilla vaaru 
Office of the Dharmaswaroopam or Directorate of King and Queen 
Hyderabad 

No comments: