మళ్లీ జన్మిస్తా,మళ్లీ జన్మిస్తా........ ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ (2003)

మళ్లీ జన్మిస్తా,మళ్లీ జన్మిస్తా
నువ్వు నేను ఏకం అయ్యే వరకూ
మళ్లీ ప్రేమిస్తా,మళ్లీ ప్రేమిస్తా
నీకై పుట్టి నిన్నే చేరేవరకూ
నిన్నే ప్రేమిస్తా
ఓహో ప్రియా ఈ మధూదయం లో ఇదేలే నా బాస
ప్రియా ప్రియా నీ సమాగమం లో ఇదేలే నా ఆశ
మళ్లీ జన్మిస్తా
నీ శ్వాస లో ఊపిరాడాలి నాకు పొత్తిళ్ళలో పాపలా
నీ పాపలా ఊయలూగాలి నేను కౌగిళ్ళలో ప్రేమలా
స్నేహమల్లే సాగేపోయే, దాహమేదో రేగే నాలో
చెలీ చెలీ ఆశలు నాలో ప్రియా ప్రియా
మళ్లీ జన్మిస్తా
మా అమ్మవై రూపం ఇవ్వాలి నాకు నా కంటికే చూపుగా
ఏ జన్మకూ తోడు కావాలి నువ్వు చుక్కానిలా చుక్కలా
బంధమేదో పెరిగే వేళ, బ్రతుకు తరిగే ఈ వేళ
నా నేను ప్రేమవు నీవే ప్రియా ,ప్రియా "మళ్లీ జన్మిస్తా "
చిత్రం : ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ (2003)
సంగీతం : ఆనంద్ మిలింద్
రచన : వేటూరి సుందరరామ మూర్తి
గానం : కె.కె
No comments:
Post a Comment