అర్చన అంటే సమర్పించడం. మనలను ఏవి ఆకర్షిస్తాయో వాటిని భగవంతునికి సమర్పించడమే దేవతార్చన.
మనలోని శబ్దస్పర్శరసరూపగంధ జ్ఞానమును కలుగజేయు విషయములను భగవంతుని ముందు సమర్పించాలి.
ఇందుకు ప్రతీకయే భగవంతునికి మనం చేసే పూజ .
శబ్దం: భగవంతునికి హారతులిస్తూ గంట మ్రోగిస్తాం. మనలోని శబ్ద జ్ఞానాన్ని దేవుని పరం చేయాలి.
స్పర్శ: కోమలమైన, అందమైన పూలతో దేవుని పూజ చేస్తాం. అంటే మనం కోరుకునే స్పర్శా సౌఖ్యాన్ని దేవునికి సమర్పించాలి.
రసం: ఇక ప్రభువుకి నైవేద్యం సమర్పిస్తాం. ఇది రసము. అంటే మనలోని జిహ్వ చాంచల్యాన్ని భగవంతుని సన్నిధిలో వదిలేయాలి.
రూపం: దేవుని ముందు దీప ప్రజ్వలనం చేస్తాం. ఇది రూపమునకు సంకేతం. రూపలావణ్యములకు ఆకర్షింపబడుమన దృష్టి జ్యోతిని భగవంతుని పరం చేయాలి.
గంధం: పూజ చేసేటప్పుడు ధూపం సమర్పిస్తాం. అంటే మనలోని విషయ వాసనల దూపాన్ని ప్రభువుకు సమర్పించాలి.
వీటన్నింటితో పాటు మనలోని మనోగత, బుద్ధిగత చాంచల్యాన్ని కూడా భగవంతునికి నివేదనము చేయాలి.
అప్పుడే మన అర్చన పరిపూర్ణమవుతుంది.
No comments:
Post a Comment