Tuesday, 10 June 2014

. కష్టాలు ఎదురైనపుడు కుంగిపోవడం..సుఖాలు ఎదురైనపుడు పొంగిపోవడం తన నైజం కాదని పోస్ట్ చేయడం

గల్లంతైన విద్యార్థుల ఫేస్‌బుక్ కామెంట్స్


రిథిమా చివరిసారిగా తన ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ చిత్రాన్ని మార్చింది. తర్వాత మార్లిన్ మన్రో చెప్పిన స్ఫూర్తినింపే వాక్యాన్ని మిత్రులకు పోస్ట్ చేసింది. ‘మొదటిసారిగా కొత్త ప్రదేశానికి రావడంతో నేను చాలా అభద్రతా భావంతో ఉన్నా. కానీ ఇక్కడి అందమైన ప్రదేశాలు, గలగల పారే సెలయేర్లు నా బెరుకును, కంగారును దూరం చేశాయి. కొత్తప్రదేశానికి వచ్చిన తరుణంలో కాసింత బెరుకు, కొంత ఉద్విగ్నం, మరికొంత ఆనందంతో ఈ క్షణాలను చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఈ పరిస్థితి నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
 
 కష్టాలను ఎదురీదుతాం: దేవ ఆశిష్ బోస్
 
‘గులాబీ అరగంట సేపు పరిమళిస్తుంది. కానీ, మన స్నేహం జీవితాంతం నిత్యనూతనంగా, సజీవంగా ఉంటుంది. జీవితంలో కష్టాలెన్ని ఎదురైనా కలిసికట్టుగా ఎదుర్కొందాం. మన ఫ్రెండ్‌షిప్ ఎల్లకాలం నిలిచి ఉంటుంది. టూర్‌లో నేను అనుభవిస్తున్న ప్రతి క్షణాన్ని జీవితంలో మరిచిపోలేను.’ అని పోస్ట్ చేశాడు బోస్.  
 
 నేను లెజెండ్...: తరుణ్
 
ఫేస్‌బుక్‌లో లెజెండ్ అనే ట్యాగ్‌లైన్ పెట్టుకున్నాడు తరుణ్. ప్రతి పనిని నైపుణ్యం, సమర్థత, సరైన విజ్ఞానంతో చేయడమే తనకు ఇష్టమని చెప్పుకున్నాడు. కష్టాలు ఎదురైనపుడు కుంగిపోవడం..సుఖాలు ఎదురైనపుడు పొంగిపోవడం తన నైజం కాదని పోస్ట్ చేయడం విశేషం.
 
ఎగ్జామ్ సిస్టమే.. ఎడ్యుకేషన్ సిస్టం కాదు: రిషితా రెడ్డి
 
రిషితా రెడ్డి తన ఫేస్‌బుక్‌లో చివరిసారిగా భారతీయ విద్యావ్యవస్థకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ తన మిత్రులకు ఓ సందేశం పోస్ట్ చేసింది. వాటిలో కొన్ని.. భారతీయ విద్యా వ్యవస్థ ఎగ్జామ్ సిస్టమే కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదంది. తన ఇష్టాలను చెబుతూ.. ఇష్టమైన హీరో మహేశ్‌బాబు, 2013లో నచ్చిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ఇటీవల చూసిన చివరి చిత్రం ‘ఐరన్‌మ్యాన్-3’, ఐపీఎల్‌లో నచ్చిన టీం ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’, నలుపు రంగు, చాక్లెట్లంటే అమితమైన ఇష్టమని పోస్ట్ చేసింది.
 
 ఆనందానికి ఆకాశమే హద్దు: పరమేశ్వర్
 
‘కొన్ని అనుభూతులను జీవితంలో మర్చిపోలేము. వాటిలో ముందు వరుసలో ఉండేది ఈ టూరే. రైల్ ఎక్కినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతీ క్షణాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నాం. ఫ్రెండ్స్‌తో చెప్పలేనంత ఎంజాయ్ చేస్తున్నా. మా ఆనందానికి ఆకాశమే హద్దు. ఇక్కడి పర్యాటక, దర్శనీయ స్థలాలు నాలో కొత్త అనుభవాలకు బీజం వేశాయి. ఈ టూర్‌ను నా లైఫ్‌లో ఎప్పటికీ మరచిపోలేను.’ అంటూ తన మదిలోని భావాన్ని పోస్ట్ చేశాడు పరమేశ్వర్.
 
క్షేమంగా తిరిగొస్తాం: సందీప్ బస్వరాజ్
 
మంగళవారం (3వ తేదీ) నాంపల్లిలో రైల్ ఎక్కిన సందీప్ చివరిసారిగా తన మిత్రుడితో ఫొటో దిగాడు. దాన్ని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. టూర్‌ను ఎంజాయ్ చేసి క్షేమంగా తిరిగొస్తామన్న కామెంట్‌ను పోస్ట్ చేశాడు. క్షేమంగా వెళ్లి ఎన్నో మధుర అనుభూతులతో తిరిగి వస్తానని తనకు సెండాఫ్ ఇచ్చిన ఫ్రెండ్‌కు చెప్పడం విశేషం. ఈ విహార యాత్రను జీవితంలో మర్చిపోలేను. ఫ్రెండ్స్‌తో గడిపిన క్షణాలు తిరిగిరావు. బాగా ఎంజాయ్ చేస్తాం.. అని పోస్ట్ చేశాడు.
 

No comments: