వెండితెర సమ్మోహన రూపానికి వజ్రోత్సవం

వెండితెరపై కొన్ని పాత్రలకు కొంతమంది నటీనటులదే పేటెంట్. ఎన్నాళ్ళయినా, ఎన్నేళ్ళయినా ఆ పాత్రల పేర్లు చెప్పగానే వారే గుర్తుకొస్తుంటారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన అలాంటి పాత్రలంటే పౌరాణికాలే. ఇక, పాత్రధారి అంటే... పురాణ పాత్రలకు ప్రాణం పోసిన స్వర్గీయ నందమూరి తారక రామారావే స్ఫురిస్తారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీమహావిష్ణువు, పరమ శివుడు మొదలు ప్రతినాయకులైన రావణుడు, దుర్యోధనుడు దాకా ఏ పాత్ర పేరు చెప్పినా ఇవాళ్టికీ ఆయనే మదిలో మెదులుతారు.
ముగ్ధమోహనరూపంతో, పాత్రోచితమైన ఆహార్యం, వాచికాలతో ఆనాడు వాళ్ళు అచ్చం ఇలాగే ఉన్నారేమో అని అందరూ అనుకొనేలా చేయడం ఆ మహానటుడు చేసిన అసాధారణ విన్యాసం. ఒక తెలుగు నటుడు వింధ్యకు ఇటు వైపునే కాక, అటు వైపునూ తన పాత్రలతో మెప్పించి, అంతర్జాతీయ సినీ చరిత్రకారులను సైతం అబ్బురపరచడం మనకు గర్వకారణమే. బెంగాలీయుల్ని కూడా కదిలించిన ఎన్టీఆర్ పౌరాణిక, జానపద చిత్రాలు, ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్న శాంతారామ్ లాంటి దర్శకులే అందుకు నిదర్శనం. పౌరాణికాలు, చారిత్రకాలు, జానపదాలు, సాంఘికాలు - ఇలా అన్ని తరహా చిత్రాల్లో మెప్పించినా, ముఖ్యంగా శ్రీకృష్ణుడంటే ఇప్పటికీ ఎన్టీఆరే.
(Published in 'Sakshi' daily, 28th May 2014, Wednesday)
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరబాద్
No comments:
Post a Comment