Monday, 2 June 2014

Great song taken me towards Dharmaswaroopam of Dr Chiranjeevi gaaru ------- Expecting and inspiring his 150th movie a great influence of elevation to the society

జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా ..... కొండవీటి దొంగ (1990)




















జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా
జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా
నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకూ కన్నీళ్ళూ
అనాధలైనా అభాగ్యులైనా అంతా నావాళ్ళూ
ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు
ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు
జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా
జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా

చరణం  : 1
అనాద జీవులా...ఆ ఆ ఆ...ఉగాది కోసం...ఊ ఊ ఊ
అనాద జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా
గుడెసె గుడెసెనూ గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా
అనాది జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా
గుడెసె గుడెసెనూ గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా

బూర్జువాలకు భూస్వాములకూ...
బూర్జువాలకు భూస్వాములకూ బూజు దులపకా తప్పదురా
తప్పదురా... తప్పదురా... తప్పదురా...
జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా
జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా

చరణం  : 2
న్యాయ దేవతకూ...ఊ ఊ ఊ...కన్నులు తెరిచే...ఏ ఏ ఏ...
న్యాయ దేవతకు కన్నులు తెరిచే ధర్మ దేవతను నేనేరా
పేద కడుపులా ఆకలి మంటకు అన్నదాతనై వస్తారా

న్యాయ దేవతకు కన్నులు తెరిచే ధర్మ దేవతను నేనేరా
పేద కడుపులా ఆకలి మంటకు అన్నదాతనై వస్తారా
దోపిడి రాజ్యం....దొంగ ప్రభుత్వం...
దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం నేల కూల్చకా తప్పదురా
తప్పదురా...తప్పదురా...తప్పదురా...
జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా
జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా


చిత్రం : కొండవీటి దొంగ (1990)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : S.P.బాల సుబ్రహ్మణ్యం
***************************************

No comments: