Tuesday, 10 June 2014

చెలిమితో గె లుచుకో చెలితో వలపాట అతిలోక సుందరి రాదా జత కోరి నీవెంట తెగువతో తేల్చుకో చెడుతో చె లగాట జగదేకవీరుడు కూడ మనలాంటి మనిషంట ఇటునుంచే అటువెళ్ళారు సినిమా హీరోలంతా దివి నుంచే దిగిరాలేదు మన తారాగణమంతా మనలోనూ ఉండుంటారు కాబోయే ఘనులంతా పైకొస్తే జైకొడతారు అభిమానులై జనమంతా

ఆ జెండాపై కపిరాజుంటే.. రథమాపేదెవరంట... ఆట (2007)


















పల్లవి :
అ అ అ... ఆట... అ అ అ... ఆట...
ఆ జెండాపై కపిరాజుంటే రథమాపేదెవరంట...
గుండెల్లో నమ్మకముంటే బెదురెందుకు పదమంట...
అ అ అ... ఆట...
అల్లాద్దీన్ అద్భుతదీపం అవసరమే లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట
అల్లదిగో ఆశల దీపం కళ్ళెదుటే ఉందంట
ఎల్లలనే పెంచే వేగం మేఘాలు తాకాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా
ఆట ఆట అనుకుంటే బతకడమొక ఆట
ఆట ఆట కాదంటే బరువే ప్రతి పూట

చరణం : 1
ముందుగా తెలుసుకో మునిగే లోతెంత
సరదాగా సాగదు బేటా నట్టేట ఎదురీత
తెలివిగా మలుచుకో నడిచే దారంతా
పులి మీద స్వారీ కూడ అలవాటు అయిపోదా
సాధించే సత్తావుంటే సమరం ఒక సయ్యాట
తల వంచుకు రావలిసిందే ప్రతి విజయం నీ వెంట
అల్లాద్దీన్ అద్భుతదీపం అవసరమే లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా

చరణం : 2
చెలిమితో గె లుచుకో చెలితో వలపాట
అతిలోక సుందరి రాదా జత కోరి నీవెంట
తెగువతో తేల్చుకో చెడుతో చె లగాట
జగదేకవీరుడు కూడ మనలాంటి మనిషంట
ఇటునుంచే అటువెళ్ళారు సినిమా హీరోలంతా
దివి నుంచే దిగిరాలేదు మన తారాగణమంతా
మనలోనూ ఉండుంటారు కాబోయే ఘనులంతా
పైకొస్తే జైకొడతారు అభిమానులై జనమంతా
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా
ఆట ఆట అనుకుంటే బతకడమొక ఆట
ఆట ఆట కాదంటే బరువే ప్రతిపూట
అ అ అ... ఆట... అ అ అ... ఆట...
అ అ అ... ఆట... అ అ అ... ఆట...


చిత్రం : ఆట (2007)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : శంకర్ మహదేవన్
******************************



   2003 లో నా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒకటి పూర్తిగా వ్యక్తం అయినది అని గ్రహించండి 


తమ   ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం 
హైదరాబాద్ 

No comments: