సమస్య ఎటువంటిదైనా, ఎంత క్లిష్టమైనదైనా సరే దానిని మనం సరళంగానే సమీపించాలి.
ఈరోజు ప్రపంచంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించడంలో మన అనుభవము, జ్ఞాపకము, జ్ఞానము, నమ్మకము - వీటిని ఆధారంగా చేసుకుని ఒక నిశ్చిత అభిప్రాయానికి వస్తాం. ఆ అభిప్రాయానికి ఒక పేరు పెట్టి ఒక సిద్ధాంతాన్ని, ఆదర్శాన్ని ప్రతిపాదిస్తాం. ఇవి ఎంత గొప్పవైనా సరే వాటి కేంద్రంగా సాగే కార్యకలాపాలు సమస్యని మరింత జటిలం చేస్తాయే గాని పరిష్కరించవు. పైగా కొత్త సమస్యలని ఉత్పన్నం చేస్తాయి.
మన ఆలోచనలు, నమ్మకాలు, సిద్ధాంతాలు, ఆదర్శాలు, జ్ఞాపకాలు, అభిప్రాయాలు - అవి ఎంత గోప్పవైనా సరే - అవి లేకుండా మనం సమస్యని సమీపించలేమా? సూటిగా ఎదుర్కోలేమా?
అలా చేయగలిగినప్పుడు సమస్య స్వరూపం మనకి అవగాహన అవుతుంది. అప్పుడు సమస్యలోనే మనకు పరిష్కారం లభిస్తుంది.
No comments:
Post a Comment