Thursday, 6 March 2014

అసత్య ధోరణలు వలన గోప్పవారు కూడా పిచ్చి వారు అయిపోతారు అని గ్రహించండి, కండబలం వలన గుండె బలం ఆవిరి అయిపోకుండా చూసుకోవాలి. పెత్తనాలు, పెనుగులాటలు పెంచుకొనరాదు, వెకిలి చేష్టలు మనుష్యులు ఎంత తగ్గించుకొంటే అంత మంచిది.

                     సమన్వయ దృష్టి 


          ధర్మస్వరూపులు, మహారాజులు శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు యావత్తు తెలుగు ప్రజలకి, భారతదేశ ప్రజలకి తెలియజేయు దివ్య సందేశము 

           అట్టడుగు మనిషి మాట కూడా పరిగణింపబడాలి, 
వ్యాధితో, బాధతో, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారిని వ్యధ తీర్చి నప్పుడే లోకమునకు శాంతి కలుగుతుంది.  అసత్య ధోరణలు వలన గోప్పవారు కూడా పిచ్చి వారు అయిపోతారు అని గ్రహించండి, కండబలం వలన గుండె బలం ఆవిరి అయిపోకుండా చూసుకోవాలి. 
పెత్తనాలు, పెనుగులాటలు పెంచుకొనరాదు, వెకిలి చేష్టలు మనుష్యులు ఎంత తగ్గించుకొంటే అంత మంచిది. ఎదుటివాడి అజ్ఞానం, బలహీనత చూసి, కిర్రు గా నవ్వడం, గొప్ప తనం వైపు వెల్ల నివ్వకుండా,  తక్కువ చేసి అవమానించి బలహీన పరచడమే తమ గెలుపు జీవితం అనుకొంటున్నారు. 

             మనిషి ఈవాళ్ళ  ధర్మస్వరూపం ప్రకారం చాలా కీలక పోసిషన్ లో కి వచ్చినాడు.    సృష్టి మనిషి మాటకి , మనసుకి  ఎంతో ప్రాధాన్యత ఇచ్చినది.  సైన్సు టెక్నాలజీ తో మనిషి ఎంతో అధిరోహించినా, మనసు మాటకు మించి అధిగమించలేడు అని అవిష్కరించుటకె నా ద్వారా సృష్టి విధానముగా  సర్వాంతర్యామి వ్యక్తము అయినాడు. సత్యమును స్వీకరించి గ్రహిస్తే చాలు, మనిషిని మనిషి అప్రమత్తం చేసుకోవాలి గాని, మాయ చేసి మోసం చేయకూడదు అని గ్రహించండి.  



ఇట్లు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
          

No comments: