అల్లా...... శ్రీ రామా......
శుబకరుడు సురు చిరుడు భవ హరుడు భగవంతుడు ఎవడు
కళ్యాణ గుణ ఘనుడు కరుణా ఘనా ఘనుడు ఎవడూ
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అల రారు అందాల చంద్రుడు ఎవడూ
ఆనంద నందనుడు అమృత రస చెందనుడు రామా చంద్రుడు కాక ఇంక ఎవ్వడు
తాగారా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం
తాగారా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం
ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగముల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్పూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదైక చక్రవర్తి
ఏ మూర్తి ఘన మూర్తి
ఏ మూర్తి గుణ కీర్తి
ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తి ఉనగాని రస మూర్తి
ఆ మూర్తి శ్రీ రామచంద్ర మూర్తి
తాగరా.... తాగరా శ్రీ రామా నామ అమృతం
ఆ నామమే దాటించు భవసాగరం
పాపా ........(ఈ విదముగా సరిగమలు కూడా స్పష్టము పలికినాను నేను ఎప్పుడూ నేర్చుకోలేదు).
సీతా రామ ..... ఆనంద రామా మామా రిమ రిమ సరిమ......జయ రామా ........
పావన నామా .....
ఏ వేల్పు యల్లా వేల్పులను గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడు ఏడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కల్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలు అన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలను కలపు
ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరు గొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపులు నేర్పు
ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడ్పు
తాగరా.... తాగరా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం
No comments:
Post a Comment