Saturday, 18 January 2014

ఈ సమాజంలో కుల ఫీలింగ్స్ అనే కంటే స్వార్ధ ఫీలింగ్స్ చాలా బలముగా ఉన్నాయి తమకు లాభం ఉంటానే మాట్లాడుతున్నారు లేక పోతే కనీసం మాట్లాడటం లేదు. తమ ధోరణే గాని ఎదుటి వాడి మేలు మంచి కొంచెం కూడా చూడటం లేదు, మానవ సంభంధాలు అన్ని అవసరం కోసం ఎర్పాటు చేసుకొన్న భంధాలే అన్నట్లు ముగిస్తున్నారు.


                 
నువ్వు సేనాని  అయ్యో  సింహాచలం సింహాని వయ్యో  నీకు ఎదురేది అయ్యో ఎదుటవాడి మేలును కోరు మనిషివి నువ్వే అని శక్తి సృష్టి నా లో చేరి పలికినది అని గ్రహించగలరు, పైకి  పైకి కనపడుతున్నవి కాదు, మనసుకి మాటకి ప్రాధాన్యత ఇచ్చుకోండి, మొదట తమ మనసు మాటకి ప్రాధాన్య ఇచ్చుకోండి తద్వారా ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వగలరు --- నా ద్వారా వ్యక్తము అయిన పాటలలో ఇది ఒకటి 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది అని గ్రహించండి.  
    
సమన్వయ దృష్టి

గౌరవనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్బముగా , వారిని జ్ఞాపకము చేసుకొనుచూ వారి గూర్చి నాలుగు మాటలు నా మనసు నుండి ఏమి అనగా నా సమకాలికులలో గొప్ప సినీ నటులు, అభ్యుదయ రాజకీయ నూతన ప్రత్యామ్నాయం గా వచ్చారు . కుల ఫీలింగ్స్, గ్రూప్ రాజకీయాలు, బల ప్రయోగాలూ ఉండకూడదు అని వారు మాటలలో అన్నట్లు నాకు గుర్తు, కాని సమాజం పూర్తీ మానవీయత సంతరించుకోవలసి ఉన్నది. అప్పుడే గొప్పతనము ఆవిష్కరించాలి అని కాంక్షించి, గతించిన వారికి నిజమైన నివాళి ఆత్మశాంతి అని తెలియజేసుకోనుచున్నాను. ఒక వ్యక్తి జీవిత కాలములో ఎంత బౌతిక జీవితము జీవించాడు, అనగా సంపద, బౌతిక స్తితి, కొలమానము కాదు, ఆలోచన ప్రకారము ప్రామాణికము గా నిలిచినా మాట మనసు ఆధారము అని, అందరూ గ్రహించాల్సిన సమయము వచ్చినది. బౌతిక అలవాట్లు లేదా ఎక్కువ, తక్కువలు ఆధారముగా మనిషిని పరిగణించే పరిస్తితి ఈవాళ బలముగా ఉన్నది. మను గడ అంటే ఆలోచన అని చదువుకొన్నవారు కూడా భావించడం లేదు. ఏది ఏమి అయినా బౌతిక ఉనికే గెలుపు అని భావిస్తున్నారు, బౌతిక ఉనికి వెనుక, మాట మనసు ఉన్నది అని గ్రహించడానికి చిన్నవారు, పెద్దవారు ఎవరూ కూడా సంసిద్దముగా లేరు. ఇప్పుడు మనసు మాటే సర్వం అను సంసిద్ధత అభివృద్ధి చేసి బలపరచవలసిన భాద్యత ధర్మస్వరూపముగా, కాలస్వరూపముగా, ఒక ఆధునిక యుగ పురుషునిగా నాకు కాలమే, ధర్మమే, మనసుగా మాటగా నన్ను వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా నిలిపినది అని గ్రహించగలరు.

ఈ సమాజంలో కుల ఫీలింగ్స్ అనే కంటే స్వార్ధ ఫీలింగ్స్ చాలా బలముగా ఉన్నాయి తమకు లాభం ఉంటానే మాట్లాడుతున్నారు లేక పోతే కనీసం మాట్లాడటం లేదు. తమ ధోరణే గాని ఎదుటి వాడి మేలు మంచి కొంచెం కూడా చూడటం లేదు, మానవ సంభంధాలు అన్ని అవసరం కోసం ఎర్పాటు చేసుకొన్న భంధాలే అన్నట్లు ముగిస్తున్నారు. ప్రతి భంధం సృష్టి ప్రకారము ధర్మస్వరూపం ప్రకారము సహజ యర్పటుగా, మనిషి యొక్క ధర్మాచరణ అభివృద్ధి పరచి తద్వారా లోకములో ధర్మం యొక్క ఉనికి నాణ్యత పెంచడానికి మనల్ని అందరిని అ సర్వాంతర్యామి నడుపుతున్నాడు అని గ్రహించగలరు. కుల మత, స్వార్ధ ఫీలింగ్స్ అంతం చెంది నూతన లోకం కొత్తబంగారు లోకం అభివృద్ధి చెందాలి అని నా ద్వారా మెరిసిన అ పురుషోత్త ముడిని కోరుకొనుచున్నాను ప్రార్దించుచున్నాను.





ఇట్లు ఆత్మీయులు

సృష్టి నియమించిన యుగపురుషులు
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
ధర్మస్వరూపులు 

కాలస్వరూపులు








No comments: