Thursday, 19 February 2015

నిజం కాని కల మరో కొత్త ఆశతో చిగురిస్తే విచారమేదో సుడిగాలిలా మారి చుట్టేసింది!


Padma Rani3:52am Feb 19
!!తీరని రుణం!!

బ్రతుకు ఖాతాలో అసలు జమా కాలేదు
ఊపిరి రుణంగా మారి ఇంకా మిగిలుంది!

చెల్లించిన జీవితం వడ్డీలా కాలంలో కలిస్తే
అసలు ఆశగా మారి పెరిగిపోతూనే ఉంది!

తీరాలన్న కోరిక రెక్కలు లేకనే ఎగరబోవ
ఆనందం ఎండినాకులా మారి నేలరాలింది!

నిజం కాని కల మరో కొత్త ఆశతో చిగురిస్తే
విచారమేదో సుడిగాలిలా మారి చుట్టేసింది!

అంచనాలే గజ్జకట్టి అంబరాన్న చిందేయబోవ
నకిలీనవ్వు సంరక్షణగా మారి తైతక్కలాడింది!

పద్మారాణి
19-02-201

No comments: