Wednesday, 28 August 2013

అనవసరమైన గొడవలు, అర్ధం లేని పంతాలు వలన ప్రశాంతము గా ప్రగతి వైపు వెళ్ళ వలసిన ప్రజలు విభేదాలు , ధర్నాలతో గడుపుతున్నారు. ఒక ప్రక్క నుండి రూపాయి విలువ తగ్గుతుంది అని, తద్వారా పెట్రోలు డీజిల్ ధరలు కూడా త్వరలో పెరుగుతాయి అని అ మేరుకు నిత్య అవసర వస్తువులు మరింత పెరుగుతాయి అని ఆందోళనలు వ్యక్తము అవుతున్నాయి.

        JAATIYA SAMANVAYA DRUSTI SAMITI 
                 ADMINISTRATIVE OFFICE
                            HYDERABAD 
                                       
    
              మహారాజ శ్రీ గౌరవనీయులు డా మన్మోహన్ సింగ్ గారు, భారత ప్రధాని, ప్రధాన మంత్రి కార్యాలయము, కొత్త ఢిల్లీ వారికీ  విన్న విన్నవించు లేఖార్ధములు. 

            ధర్మస్వరూపం యావత్తు మానవజాతికి ఒక సామాన్యుడు రూపములో అందిన దివ్య పరిష్కారము, భవిష్యత్తు అని తెలియజేసుకోనుచున్నాను. తమరికి తమరి ద్వారా యావత్తు భారత దేశ ప్రజలకు శ్రీ కృష్ణ జన్మ అష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాను. 

          అనవసరమైన గొడవలు, అర్ధం లేని పంతాలు వలన ప్రశాంతము గా ప్రగతి వైపు వెళ్ళ వలసిన ప్రజలు విభేదాలు , ధర్నాలతో గడుపుతున్నారు.  ఒక ప్రక్క నుండి రూపాయి విలువ తగ్గుతుంది అని, తద్వారా పెట్రోలు డీజిల్ ధరలు  కూడా త్వరలో పెరుగుతాయి అని అ మేరుకు నిత్య అవసర వస్తువులు మరింత పెరుగుతాయి అని ఆందోళనలు వ్యక్తము అవుతున్నాయి.  

             ఈ సమస్యలు అన్నిటికి పరిష్కారం మనిషి లో స్వార్ధం తగ్గి,  సాటి మనిషిని గౌరవించి, ఆత్మ గౌరవముతో  జీవించే మార్గం వలెనే, సంపదలు కూడా  నియంత్రింప బడి, దుర్వినియోగం చెందకుండా మనిషి యొక్క నాణ్యమైన వినియోగమునకు వచ్చి, మానవ  ప్రపంచం అర్ధవంతముగా  శక్తి వంతము గా మారుతుంది.  
            ఒక ప్రధాన మంత్రి గా, రాజకీయ వ్యవస్థలో ఒక రాజకీయ నాయకుడిగా ఇతర  రాజకీయ పార్టీల పోటీని తట్టుకొంటూ, నాణ్యమైన విధాన  పర మైన నిర్ణయములు తీసుకొని సామరస్యం సాధించడం,  ఈ భూమి మీద ఏ ఒక్క అధికార పీఠమునకు  పూర్తిగా సాధ్య పడదు , మనిషికి మనసును  నియంత్రించే శక్తి ఒక్కటె శాశ్వత పరిష్కారము.  అ శక్తి నిస్వార్ధత , సాటి మనిషి మీద, మాట మీద ఆసక్తి, ప్రేమ గౌరవం పెంచుకోనంత వరకు మానవజాతిని ఏ శక్తి పూర్తిగా సంస్కరించలేదు అని ప్రతి ఒక్కరు వెంటనే తెలుసుకోవాలి. 
              
                 తమరి ద్వారా సూటి గా కోరునది ఏమి అనగా ఒక మూడు నెలలు  తెలంగాణా విభజన సమస్య ప్రకన్న పెట్టి, తెలుగు మీడియా జాతీయ మీడియా ద్వారా మేధావులు, గురువులు  అభిప్రాయములు, వివరణలతో  ధర్మస్వరూపం (అనగా ఒక మహారాజు మహారాణి, వారి పరిపాలన, యావత్తు మానవజాతికి  తల్లి తండ్రి గురువు ఇది అన్ని మతస్తులు, అందరి ప్రజలకు వర్తిస్తుంది ) యొక్క వివరములు ప్రజల దృష్టి కి తీసుకొని వెళ్ళితే, ఒక కొత్త పరిష్కారము అందినట్లు అందరూ గ్రహించగలరు.   ఒక మనిషి మాటే సర్వం అను సత్యమును   బల పరుచుకోనుట వలన, పంతాలు వ్యతిరేకతలు తగ్గి మంచి వాతావరణం నిలుస్తుంది అని తమరి ద్వారా మేధావులను గురువులను కోరుకొనుచున్నాను 

ఇట్లు 
తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
మరియు వ్యవస్థాపక అధ్యక్షులు 
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

ఒక ప్రతి వివిధ మేధావులు గురువులు, తెలుగు మీడియా చానల్స్ మరియు జాతీయ చానల్స్ వారికీ ఒక ప్రతి సమర్పించడమైనది.   మేధావులు ను గురువులను కోరునది ఏమి అనగా మనిషికి మనిషి విలువ పెంచుకొంటే అన్ని సమస్యలు అవే పరిష్కారము అవుతాయి. సంపదలు, పదవులు మెల్లగా త్యాగం చేసి మానవత్వముతో ముందుకు రావలెను, జ్ఞానమును, దైర్యమును పెంచుకొని, పంచుకొని జీవించాలి అప్పుడే మనిషి శాంత వంతముగా, సంస్కరవంతము గా ఉండగలదు. 

ఒక ప్రతి గౌరవ సుప్రీమ్ కోర్ట్, కొత్త ఢిల్లీ వారికీ   ఒక పౌరుడిగా నాకు కలిగిన ప్రత్యేక  మానసిక పరిణామమును లోకమునకు సాటి మనుష్యులకు ఉపయోగ పెట్టి సమస్యలు పరిష్కరించడం నా హక్కు గా గుర్తించి తగిన న్యాయ సహకారము అందించగలరు. 

ఒక ప్రతి కేంద్ర మంత్రులు అయిన డా పళ్ళం రాజుగారు, డా చిరంజీవి గారు, శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు, 
ప్రతి పక్ష నాయకులు అయిన శ్రీ నారా చంద్ర బాబు నాయిడుగారు, తెలంగాణా పోరాట సమితి అధ్యక్షులు కె. చంద్ర శేఖర రావు గారు, డా జయ ప్రకాష్ నారాయణ గారు, లోక్ సత్తా వ్యవస్థాపకులు మొదలుగు నాయకులకు కోరుకోనునది ఏమి అనగా ప్రజలను శాంతా వంతము వ్యవహరించుటకు ధర్మస్వరూపం యొక్క వివరములు పండితుల సహకారముతో  నిరంతరము వివరించుట వలన గొప్ప మార్పు సమాజం లో వస్తుంది. 
సర్వ అమోధ కరమైన మహారాజు మహారాణి గారి పరిపాలన సృష్టి ధర్మం ప్రకారముఎప్పుడో ప్రారంభం అయినది అని ప్రజలు గ్రహించేటట్లు చెయగలరు. ధర్మస్వరూపం అన్ని వర్గాలవరకు ఆధరణీయము అయిన గురుతర్యము, మరియు తల్లి తండ్రి గురువు వంటి ఆదరణ కలిగి ఉన్నది అని గ్రహించగలరు. వివరములు లోకమునకు చెప్పడానికి కృషి చేయండి ఫలి తము మేరే
 చూస్తారు . శాశ్వత పరిష్కరముల కొరకు ముందుకు రాగలరు. పండితులు, మీడియా చానల్స్ వారు   నా ఈమెయిలు ద్వారా  సంప్రదించండి, వివరములు లోకమునకు చెప్పుటకు తమ మేధా శక్తిని ఉపయోగించుకొని  సార్ధకత చెందండి . ముందుకు రండి

ఇట్లు 
తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
మరియు వ్యవస్థాపక అధ్యక్షులు 
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్                       

No comments: