సాయి శరణం బాబా శరణం శరణం.... శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)

హే! పాండురంగా! హే! పండరి నాథా!
శరణం శరణం శరణం
పల్లవి :
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
చరణం : 1
విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై
పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై
తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై
మహల్సా, శ్యామాకు మారుతి గాను మరి కొందరికి దత్తాత్రేయుడుగా
యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల జేసాడు "సాయీ"
చరణం : 2
పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను, ఆదరించె తాననాథ నాథుడై
అజ్ఞానం అలముకొన్న అంధులను చేరదీసి, అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై
వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను, పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై
పుచ్చుకున్న పాపమునకు ప్రక్షాళన చేసుకొనెను, దౌత్య క్రియ సిద్ధితో శుద్ధుడై
అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో, ఆత్మ శక్తి చాటినాడు సిద్ధుడై
జీవరాశులన్నిటికి సాయే శరణం, సాయే శరణం
విద్య దాన సాధనకు సాయే శరణం, సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం (2)
భక్తికీ సాయే శరణం, ముక్తికీ సాయే శరణం (2) "సాయీ"
చిత్రం : శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
రచన : ఆత్రేయ
గానం : కె.జె.యేసుదాసు
సత్యం చెప్పి నా నుండి అసలు దృష్టి ని వ్యక్త పరచి నూతన దృస్టిని సమన్వయ దృష్టి గా లోకానికి
ప్రసాదించినాడు ఈ వాళ 3-6-1974 నా జన్మదినము నరసాపురం లో షుమారు సాయంత్రం 6, 7 గంటల సమయంలో జన్మించినాను. నా జీవితంలో ధర్మస్వరూపం అనుగ్రహం పొందడమే కీలకం ప్రజలు నిజాయితీ కొలది గ్రహించినంత అభివృద్ధి చెంది లోకాన్ని తల్లి తండ్రి గురువు వలె కాస్తుంది. ధర్మస్వరూపం అనగా మహారాజు మహారాణి గారి పరిపాలన ప్రారంభం అయినది.
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment